టాప్ 10 జిల్లాల్లో కరోనా కేసులు పెరిగాయి: కేంద్ర ఆరోగ్య శాఖ

ABN , First Publish Date - 2021-03-25T01:57:56+05:30 IST

టాప్ 10 జిల్లాల్లో కరోనా కేసులు పెరిగాయి: కేంద్ర ఆరోగ్య శాఖ

టాప్ 10 జిల్లాల్లో కరోనా కేసులు పెరిగాయి: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో టాప్ 10 జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం బుధవారం ఓ జాబితాను విడుదల చేసింది.


పుణె, నాగ్‌పూర్, ముంబై, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, జల్గాన్, అకోలా జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా పెరిగాయని పేర్కొంది. మహారాష్ట్రలో తొమ్మిది జిల్లాలు, కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లాలో అధికంగా కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ విలేకరుల సమావేశంలో అన్నారు.

Updated Date - 2021-03-25T01:57:56+05:30 IST