అధిక కోవిడ్ కేసులున్న రాష్ట్రాల జాబితాను ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2021-05-08T22:29:02+05:30 IST

అధిక కోవిడ్ కేసులున్న రాష్ట్రాల జాబితాను ప్రకటించిన కేంద్రం

అధిక కోవిడ్ కేసులున్న రాష్ట్రాల జాబితాను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: భారతదేశంలో అధిక కోవిడ్-19 కేసులున్న రాష్ట్రాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో 12 రాష్ట్రాల్లో 37,23,446 యాక్టివ్ కేసులు, 80.68% ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా కోవిడ్-19 కేసులు 6.57 లక్షలు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ఇతర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, హర్యానా మరియు బీహార్ ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మరో వైపు దేశంలో రోజువారీగా కోవిడ్ కేసులు నాలుగు లక్షలకు పైగానే నమోదవుతున్నాయి. పెరుగుతున్న కోవిడ్ కేసులతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

Updated Date - 2021-05-08T22:29:02+05:30 IST