లక్షల్లో యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలను ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2021-05-21T00:00:58+05:30 IST

లక్షల్లో యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలను ప్రకటించిన కేంద్రం

లక్షల్లో యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలలో ఇప్పుడు లక్షకు పైగా యాక్టివ్ కరోనా వైరస్ కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో 5,58,911 కేసులు ఉండగా, మహారాష్ట్ర (4,04,229) కేసులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 31,29,878 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-05-21T00:00:58+05:30 IST