యాపిల్‌కు చార్జర్ షాక్.. 14కోట్ల జరిమానా!

ABN , First Publish Date - 2021-03-22T11:30:00+05:30 IST

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐఫోన్‌కు షాక్. ఈ కంపెనీ నుంచి వచ్చిన తాజా మోడల్ ఐఫోన్ 12ను కొనుగోలు చేసిన వారికి ఆ కంపెనీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. మొబైల్‌తో పాటు చార్జర్ ఇవ్వకుండా, దాన్ని విడిగా కొనుగోలు చేయాలని సూచించింది.

యాపిల్‌కు చార్జర్ షాక్.. 14కోట్ల జరిమానా!

బ్రజీలియా: ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐఫోన్‌కు షాక్. ఈ కంపెనీ నుంచి వచ్చిన తాజా మోడల్ ఐఫోన్ 12ను కొనుగోలు చేసిన వారికి ఆ కంపెనీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. మొబైల్‌తో పాటు చార్జర్ ఇవ్వకుండా, దాన్ని విడిగా కొనుగోలు చేయాలని సూచించింది. దీనిపై అప్పట్లో సోషల్ మీడియా హోరెత్తింది. యాపిల్ సంస్థపై మీమ్స్, ట్రోల్స్ ఒక రేంజ్‌లో వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయంలో యాపిల్ కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం షాకిచ్చింది. బ్రెజిల్‌కు చెందిన కన్జూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేటరీ.. ఇలా మొబైల్‌కు చార్జర్ ఇవ్వకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆ కంపెనీకి సుమారు 14 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ‘‘ప్రజలను తప్పుదోవ పట్టించే అడ్వటైజింగ్, చార్జర్ లేకుండా వస్తువు అమ్మడం, అన్యాయమైన షరతులు విధించడం’’ వంటి చర్యలకు పాల్పడిందంటూ యాపిల్‌పై సదరు రెగ్యులేటరీ నిప్పులు చెరిగింది. ఇలా చార్జర్ లేకుండా చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ఉపయోగం ఉందో యాపిల్ వివరించలేకపోయిందని రెగ్యులేటరీ స్పష్టం చేసింది.

Updated Date - 2021-03-22T11:30:00+05:30 IST