వివరాలు అడగడం కూడా తప్పేనా?: తమిళిసై
ABN , First Publish Date - 2021-10-29T12:55:05+05:30 IST
ప్రభుత్వం చేపడుతున్న పథకాల వివరాలను గవర్నర్ తెలుసుకోవడంలో తప్పేముందని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. పథకాల అమలుపై ఆర్‌ఎన్ రవి నివేదిక కోరాడాన్ని కొంతమంది
చెన్నై: ప్రభుత్వం చేపడుతున్న పథకాల వివరాలను గవర్నర్ తెలుసుకోవడంలో తప్పేముందని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. పథకాల అమలుపై ఆర్‌ఎన్ రవి నివేదిక కోరాడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారని మండిపడ్డారు. తాను తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నానని తెలిపారు. అక్కడెవ్వరూ తప్పు పట్టడం లేదని, కానీ రాష్ట్రంలో మాత్రం గవర్నర్ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళిసై మీడియాతో మాట్లాడారు.
తిరుప్పర్ జిల్లాలో పూజలు
డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుప్పూరు జిల్లా వనంగాముడియనూరులో ఉన్న తమ కులదైవ ఆలయాన్ని సందర్శిం చారు. ఆ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని మహాపెరియసామిని ఆమె దర్శనం చేసుకు న్నారు. గవర్నర్ తమిళిసై, ఆమె భర్త డాక్టర్ సౌందరరాజన్ కుటుబ సభ్యులకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.