తిరుచెందూరు ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-12-15T14:25:53+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కుటుంబ సమేతంగా తిరెచెందూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయా న్ని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం తిరునల్వేలి

తిరుచెందూరు ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు

చెన్నై: రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కుటుంబ సమేతంగా తిరెచెందూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయా న్ని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం తిరునల్వేలి జిల్లా ఎట్టయపురంలో మహాకవి భారతియార్‌ స్మారక మందిరాన్ని సందర్శించారు. ఆ తర్వాత కారులో బయల్దేరి రాత్రి ఏడు గంటలకు తిరుచెందూరు ఆలయ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బసచేశారు. మంగళవారం ఉదయం 6.45 గంటలకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ఆయన సతీమణి లక్ష్మీరవి, ఇతర కుటుంబ సభ్యులు తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయానికి వెళ్ళారు. ఆలయం వద్ద  గవర్నర్‌ దంపతులకు ప్రధాన అర్చకులు, శైవాగమ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత గవర్నర్‌, ఆయన కుటుంబ సభ్యులు గర్భాలయంలో స్వామి వారిని దర్శించారు. ఆ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మంతటా గవర్నర్‌ దంపతులు ప్రదక్షిణ చేశారు. గవర్నర్‌ దంపతులకు సబ్‌కలెక్టర్‌ ఎం. కోకిల, ఆలయ డిప్యూటీ కమిషనర్‌ సి. కుమారదురై, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశన్‌ ఎస్పీ జయకుమార్‌, తిరుచెందూరు అసిస్టెంట్‌ పోలీసు సూపరిటెండెంట్‌ హర్షసింగ్‌ తదితరులు స్వాగతం పలికారు.

Updated Date - 2021-12-15T14:25:53+05:30 IST