లాక్‌డౌన్ సమయంలోనూ రోడ్లపైకి జనం... కట్టడిలో అధికారులు విఫలం!
ABN , First Publish Date - 2021-05-13T14:13:57+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దృష్ట్యా యూపీ ప్రభుత్వం...

గోరఖ్‌పూర్: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దృష్ట్యా యూపీ ప్రభుత్వం మే 17 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. ఈ సమయంలో అత్యవసర పనులపై వెళ్లేవారినే అనుమతించాల్సివుంటుంది. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ జనం రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నారు. వారిని అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. దీంతో వారిపై పలు విమర్శలు వస్తున్నాయి. గోరఖ్‌పూర్‌లోని శాస్త్రి చౌక్‌లో దుకాణాల వద్ద ఉన్న జనాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. వారికి కరోనా పట్ల భయం లేనట్లు కనిపిస్తోంది. పలువురు మాస్క్ పెట్టుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు కూడా వీరి విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని ఇకనైనా కట్టడి చేయాలని అధికారులను పలువురు కోరుతున్నారు.