త్వరలో గూగుల్‌ క్రోమ్‌ ఢమాల్‌?

ABN , First Publish Date - 2021-12-26T07:10:00+05:30 IST

‘ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు నిర్వచనమేంటి?’.. ‘కంప్యూటర్‌లో విండో్‌సను ఇన్‌స్టాల్‌ చేశాక.. గూగుల్‌ క్రోమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఉపయోగపడే ఓ సాఫ్ట్‌వేర్‌’.. ..

త్వరలో గూగుల్‌ క్రోమ్‌ ఢమాల్‌?

 వెర్షన్‌ 100కు చేరితే.. కొన్ని సైట్లు బ్లాక్‌

వాషింగ్టన్‌, డిసెంబరు 25: ‘ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు నిర్వచనమేంటి?’.. ‘కంప్యూటర్‌లో విండో్‌సను ఇన్‌స్టాల్‌ చేశాక.. గూగుల్‌ క్రోమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఉపయోగపడే ఓ సాఫ్ట్‌వేర్‌’.. ఇదీ గడిచిన రెండు దశాబ్దాలుగా టెకీల్లో లైవ్‌గా ఉన్న ఓ జోక్‌. కానీ, ఇప్పుడు గూగుల్‌ క్రోమ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఈ విషయాన్ని తొలుత ఫోర్బ్స్‌ వెల్లడించగా.. తాజాగా గూగుల్‌ తన క్రోమియంబగ్‌ ట్రాకర్‌ బ్లాగ్‌లో దీన్ని నిర్ధారించింది. తన 200 కోట్ల మంది క్రోమ్‌ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ బ్రౌజర్‌పై త్వరలో కొన్ని వెబ్‌సైట్‌లు పూర్తిగా బ్లాక్‌ అయ్యే ప్రమాదముందని పేర్కొంది. రాబోయే అనిశ్చితికి పరిష్కారమే లేకపోవచ్చునని అభిప్రాయపడింది.


ఏమిటా సమస్య?

ప్రస్తుతం గూగుల్‌ క్రోమ్‌ 96వ వెర్షన్‌ అందుబాటులో ఉంది. మరో నెల రోజుల్లో 97వ వెర్షన్‌.. మూడు నెలల్లో 100వ వెర్షన్‌ రానుంది. 100వ వెర్షన్‌తో క్రోమ్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యే ప్రమాదముందని ఫోర్బ్స్‌ పేర్కొనగా.. కొన్ని కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(సీఎంఎ్‌స)ల ద్వారా అభివృద్ధి చేసిన వెబ్‌సైట్లకు మాత్రమే సమస్య ఉంటుందని, అవి తమ బ్రౌజర్లో బ్లాక్‌ అయ్యే ప్రమాదముందని గూగుల్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ‘డ్యూడ’ అనే అమెరికాకు చెందిన వెబ్‌ డెవలపింగ్‌ ప్లాట్‌ఫామ్‌(సీఎంఎ్‌స)లో బ్రౌజర్‌ వెర్షన్‌ వెరిఫికేషన్‌కు రెండంకెల సంఖ్యకే అవకాశం ఉంది. క్రోమ్‌ వెర్షన్‌ 100కు చేరితే.. మూడంకెల సంఖ్యకు అవకాశం ఉండదు. అంటే.. అచ్చంగా వై2కే మాదిరి సమస్య అన్నమాట. ఒకవేళ 100లోని మొదటి రెండు అంకెలను డ్యూడ పరిగణనలోకి తీసుకున్నా.. అది 10గా ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆ సీఎంఎస్‌ క్రోమ్‌ 40లోపు వెర్షన్లను బ్లాక్‌ చేస్తోంది. దాంతో.. డ్యూడ్‌ ప్లాట్‌ఫాంపై అభివృద్ధి చెందే వెబ్‌సైట్లన్నీ క్రోమ్‌-100 తర్వాతి వెర్షన్లలో పనిచేయవు. వర్డ్‌ప్రెస్‌, పీహెచ్‌పీ వంటి సీఎంఎ్‌సలకు సమస్య ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే వెబ్‌సైట్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే వివరాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమస్య కారణంగా క్రోమ్‌ వినియోగదారులు ఫైర్‌ఫాక్స్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ వంటి బ్రౌజర్లవైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయంటున్నారు. అయితే.. మూడంకెల సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు గూగుల్‌ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-12-26T07:10:00+05:30 IST