మట్టి పెళ్లల్లో కూరుకుపోయిన రైలు

ABN , First Publish Date - 2021-07-24T14:26:34+05:30 IST

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో...

మట్టి పెళ్లల్లో కూరుకుపోయిన రైలు

ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో కర్ణాటకలోని మంగళూరు నుంచి ముంబై వెళుతున్న రైలుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుగ్ధసాగర్-సోనోలిమ్ సెక్షన్‌లో వెళుతున్న ఈ రైలు మట్టి పెళ్లల కారణంగా పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రమాదం బారిన పడిన కోచ్‌లోని ప్రయాణికులను తిరిగి కులేమ్ పంపించారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. 

                                         Funny Bawa సౌజన్యంతో....Updated Date - 2021-07-24T14:26:34+05:30 IST