అన్ని పత్రాలు ఇచ్చాను: రాబర్ట్ వాద్రా

ABN , First Publish Date - 2021-01-06T02:15:13+05:30 IST

అన్ని పత్రాలు ఇచ్చాను: రాబర్ట్ వాద్రా

అన్ని పత్రాలు ఇచ్చాను: రాబర్ట్ వాద్రా

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అన్ని రకాల పత్రాలను సమర్పించానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు హాజరు అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు ఎలాంటి తనిఖీ అయినా చేసుకోవచ్చు, వాల్లు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు. ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ద్వారా యూకేలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు వాద్రాపై అభియోగాలున్నాయి. 2018లో నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో పేద ప్రజల పునరావాసం కోసం ఉద్దేశించిన భూమిని వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థ సేకరించదన్న ఆరోపణపై 2015లో మనీ లాండరింగ్ కేసు నమోదైంది.


ఈ విషయమై రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని ఆదాయపు పన్ను అధికారులు సోమవారంనాడు రికార్డు చేశారు. బినామీ ఆస్తుల కేసులో ఈ వాంగ్మూలం నమోదు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈస్ట్ ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్‌లో ఉన్న వాద్రా కార్యాలయానికి సోమవారం ఉదయం చేరుకున్న ఐటీ శాఖ అధికారులు బికనీర్, ఫరాదాబాద్ భూ కుంభకోణాలతో సహా బినామీ ఆస్తుల కేసుల్లో ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నట్టు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-01-06T02:15:13+05:30 IST