జీఎస్టీ పరిహారం ఇంకో ఐదేళ్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-12-31T09:00:12+05:30 IST

మరో ఐదేళ్లపాటు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందించాలని పలు రాష్ట్రాల మంత్రులు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. జీఎస్టీ అమలుతోపాటు కొవిడ్‌ వల్ల రాష్ట్రాల ఆదాయం బాగా తగ్గినందున కేంద్రం ఆదుకోవాలని మంత్రులు పట్టుబట్టారు.

జీఎస్టీ పరిహారం ఇంకో ఐదేళ్లు ఇవ్వండి

పన్నుల ఆదాయం కోల్పోయాం: రాష్ట్రాలు 

న్యూఢిల్లీ, డిసెంబరు 30: మరో ఐదేళ్లపాటు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందించాలని పలు రాష్ట్రాల మంత్రులు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. జీఎస్టీ అమలుతోపాటు కొవిడ్‌ వల్ల రాష్ట్రాల ఆదాయం బాగా తగ్గినందున కేంద్రం ఆదుకోవాలని మంత్రులు పట్టుబట్టారు. బడ్జెట్‌ సన్నాహక సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనేక రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న జీఎస్టీ పరిహారం గడువు వచ్చే ఏడాది జూన్‌తో ముగియనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గడువును పెంచాలని కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, చత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు చెందిన మం త్రులు డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారానికి సంబంధించి కేం ద్రం ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని చత్తీ్‌సగఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బగేల్‌ ఆరోపించారు. తెలంగాణ తరఫున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హాజరయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించారు. బడ్జెట్‌ సందర్భంగా రాష్ట్రాల డిమాండ్లు, ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


Updated Date - 2021-12-31T09:00:12+05:30 IST