స్కూళ్ల‌కే అతీగతీలేదు... యూనిఫారాల రంగు మారుస్తార‌ట‌!

ABN , First Publish Date - 2021-06-22T13:26:08+05:30 IST

రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

స్కూళ్ల‌కే అతీగతీలేదు... యూనిఫారాల రంగు మారుస్తార‌ట‌!

జైపూర్: రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు త‌మ యూనిఫారాల‌ను మ‌ళ్లీ మార్చుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌త బీజేపీ స‌ర్కారు ప్ర‌భుత్వ పాఠశాలల‌ విద్యార్థుల దుస్తుల రంగు మార్చింది. ఇప్పుడు నాలుగు సంవత్సరాల తరువాత గెహ్లాట్ స‌ర్కారు మరోమారు పాఠ‌శాల విద్యార్థుల యూనిఫారాల రంగు మార్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌లే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత దుస్తులు అందిస్తామని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ఇంకా పాఠశాలలనే తెరవలేదు అయితే ఇంత‌లోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా...ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ యూనిఫారం రంగు మారుస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుక‌య్యే ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు. అయితే ప్ర‌స్తుతానికి పాఠశాలలను తెరవడం గురించి ఇప్పుడేమీ చెప్ప‌లేమ‌న్నారు.  స్మైల్ ప్రాజెక్ట్, ఆవో ఘర్ శిక్షా అభియాన్, ఇ-క్లాస్, శిక్షా వాణి, శిక్షా దర్శన్, హవామహల్ మొదలైన మాధ్య‌మాల్లో ఆన్‌లైన్‌లో విద్యా బోధన కొనసాగుతుంద‌న్నారు. 

Updated Date - 2021-06-22T13:26:08+05:30 IST