గాంధీ శాంతి బహుమతులు ఎవరికంటే?

ABN , First Publish Date - 2021-03-23T04:17:59+05:30 IST

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతులను ప్రకటించారు.

గాంధీ శాంతి బహుమతులు ఎవరికంటే?

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతులను ప్రకటించారు. 2019 సంవత్సరానికి గాను దివంగత ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయద్‌కు ప్రకటించారు. భారత్-ఒమన్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయంగా శాంతి, శ్రేయస్సు కోసం ఖబూస్ కృషి చేశారని మోదీ కీర్తించారు. తాను ఒమన్ పర్యటనలో ఆయనతో భేటీ అయిన ఫొటోలను జత చేస్తూ మోదీ ట్వీట్ చేశారు.  2020 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతిని దివంగత బంగ బంధు షేక్ ముజిబూర్ రహమాన్‌కు ప్రకటించారు. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడిగా, ఆ తర్వాత 1975లో హత్యకు గురయ్యే వరకూ ప్రధానిగా కూడా ముజిబూర్ రహమాన్ సేవలందించారు. ఆయన స్థాపించిన అవామీలీగ్‌కు ఆయన కుమార్తె, బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ముజిబూర్ రహమాన్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఆయనకు గాంధీ శాంతి బహుమతి ప్రకటించడంపై బంగ్లాదేశ్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. Updated Date - 2021-03-23T04:17:59+05:30 IST