గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు పొందిన సీఎం

ABN , First Publish Date - 2021-08-10T16:10:48+05:30 IST

మైసూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అవధూత దత్తపీఠాన్ని సోమవారం సందర్శించారు. పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులు పొందారు. ఆశ్రమానికి

గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు పొందిన సీఎం

బెంగళూరు: మైసూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అవధూత దత్తపీఠాన్ని సోమవారం సందర్శించారు. పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులు పొందారు. ఆశ్రమానికి విచ్చేసిన సీఎం, మంత్రుల బృందానికి అంతకు ముందు మఠం నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. అవధూత దత్తపీఠం చేపట్టిన పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవలను ఈ సందర్భంగా సీఎంకు స్వామిజీ వివరించారు. సీఎం వెంట మంత్రులు మురుగేష్‌ నిరాణి, ఎస్‌టీ సోమశేఖర్‌, డాక్టర్‌ నారాయణగౌడ తదితరులున్నారు.

Updated Date - 2021-08-10T16:10:48+05:30 IST