‘గాలి’ బెయిల్‌ షరతులు సడలింపు

ABN , First Publish Date - 2021-08-20T08:53:31+05:30 IST

మైనింగ్‌ స్కామ్‌ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దనరెడ్డికి కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం జిల్లాలకు..

‘గాలి’ బెయిల్‌ షరతులు సడలింపు

న్యూఢిల్లీ, బెంగళూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మైనింగ్‌ స్కామ్‌ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దనరెడ్డికి కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. బెయిల్‌ షరతులను సడలించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ట్రయల్‌ ఇంకా ప్రారంభం కాలేదని, పిటిషనర్‌ బెయిల్‌ షరతులను ఉల్లంఘించలేదన్న వాదనల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం..  షరతులను సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఆ జిల్లాలకు వెళ్లిన సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది. 

Updated Date - 2021-08-20T08:53:31+05:30 IST