మందు కావాలంటే ఫుల్ వ్యాక్సినేషన్ కావాల్సిందేనట!
ABN , First Publish Date - 2021-09-03T23:28:08+05:30 IST
లిక్కర్ దుకాణాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అయినట్టు ధ్రువపత్రం తప్పనిసరిగా చూపించాలి. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తూ అందరూ వ్యాక్సినేషన్ చేయించుకునేలా ప్రోత్సహించడానికే ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ దివ్య తెలిపారు.

చెన్నై: తమిళనాడులో మందుబాబులకు కొత్త రూల్స్ పెట్టారు. లిక్కర్ కొనుక్కోవాలంటే తప్పనిసరిగా ఫుల్ వ్యాక్సినేషన్ కావాల్సిందేనని తమిళనాడులోని నిల్గురిస్ జిల్లా కలెక్టర్ దివ్య గురువారం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని టీఏఎస్‌ఎమ్ఏసీ ఔట్‌లెట్లలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అయిన వారికి మాత్రమే మందు అమ్మనున్నారు. లిక్కర్ దుకాణాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అయినట్టు ధ్రువపత్రం తప్పనిసరిగా చూపించాలి. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తూ అందరూ వ్యాక్సినేషన్ చేయించుకునేలా ప్రోత్సహించడానికే ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ దివ్య తెలిపారు.