గడ్డ కట్టిస్తున్న చలిగాలులు
ABN , First Publish Date - 2021-01-20T08:03:12+05:30 IST
తీవ్రమైన చలిగాలులు కశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.

- జమ్మూ కశ్మీర్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు
శ్రీనగర్, జనవరి 19: తీవ్రమైన చలిగాలులు కశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరడంతో ప్రసిద్ధి గాంచిన దాల్ సరస్సుతో పాటు పలు నదులు, కుంటలు గడ్డ కట్టిపోయాయి. శ్రీనగర్, కశ్మీర్ లోయతో పాటు వివిధ ప్రాంతాల్లో రోడ్ల మీద పెద్ద మొత్తంలో మంచు పేరుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కశ్మీరు లోయ ముఖ ద్వారమైన ఖాజీగండ్‌లో -8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మూ కశ్మీర్‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఇదే. శ్రీనగర్‌లో -7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.