బీజేపీ మాజీ ఎమ్మెల్యే రామ భట్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-07T15:12:07+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా మాజీ ఎమ్మెల్యే కె. రామభట్ కన్నుమూశారు...

బీజేపీ మాజీ ఎమ్మెల్యే రామ భట్ కన్నుమూత

మంగళూరు : కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా మాజీ ఎమ్మెల్యే కె. రామభట్ కన్నుమూశారు. పాఠశాల విద్యార్థి దశ నుంచి క్రియాశీలక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన రామభట్ పుత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు పోటీ చేశారు.బీజేపీ భీష్మాగా పేరొందిన రామభట్ వయసు 92 ఏళ్లు. ఈయన 1977వ సంవత్సరంలో జనసంఘ్ అభ్యర్థిగా మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1983లో రామభట్ బీజేపీ అభ్యర్థిగా చివరిసారి పోటీ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాల్లో రామభట్ బీజేపీని బలోపేతం చేశారు.ఎమర్జెన్సీ సమయంలో అడ్వానీతో కలిసి రామభట్ జైలుకెళ్లారు. 


పుత్తూర్ మహాలింగేశ్వర దేవాలయం ట్రస్టీగా ఈయన సేవలందించారు. ఈయనకు భార్య కుమారుడు, ఇద్దరు కూతుళ్లున్నారు. ‘‘జనసంఘ్, బీజేపీ చరిత్రలో ఉరిమజలు కె. రామ భట్ జీ వంటి దిగ్గజాలకు ప్రత్యేక స్థానం ఉంది. కర్నాటకలో మా పార్టీ బలోపేతానికి ఆయన పట్టుదలతో పనిచేశారు, ఆయన మృతి పట్ల నేను చింతిస్తున్నాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-12-07T15:12:07+05:30 IST