డీఎంకేలో చేరిన తోప్పు వెంకటాచలం

ABN , First Publish Date - 2021-07-12T16:18:07+05:30 IST

అన్నాడీఎంకే మాజీ మంత్రి తోప్పు వెంకటాచలం డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివా లయంలో ఆదివారం ఉదయం...

డీఎంకేలో చేరిన తోప్పు వెంకటాచలం

చెన్నై: అన్నాడీఎంకే మాజీ మంత్రి తోప్పు వెంకటాచలం డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివా లయంలో ఆదివారం ఉదయం ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ఆయన డీఎంకే సభ్యత్వం స్వీకరించారు. పార్టీలోకి ఆహ్వానిస్తూ స్టాలిన్‌ ఆయనను శాలువతో సత్కరిం చారు. ఆ సందర్భంగా తోప్పు వెంకటాచలం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పుష్పగుచ్చం అందించారు. తోప్పు వెంకటాచలంతో పాటు  అందియూరు మాజీ శాసనసభ్యుడు కృష్ణన్‌, జిల్లా కౌన్సిలర్లు, 15 సహకార బ్యాంక్‌ సంఘాల అధ్యక్షులు, మహి ళావిభాగం డిప్యూటీ కార్యదర్శి, ఈరోడ్‌, పెరుంతురై, గోపిశెట్టి పాళయం, భవానీ నియోజకవర్గాలకు చెందిన అన్నాడీఎంకే స్థానిక శాఖల నాయకులు సహా ఈరోడ్‌ జిల్లాకు చెందిన రెండు వేలమంది డీఎంకే సభ్యత్వాన్ని స్వీకరించారు. ప్రస్తుతం కరోనా నిరోధక నిబంధనలు అమలులో వుండటం తో అరివాలయంలో సుమారు రెండు వందల మంది మాత్ర మే డీఎంకే సభ్యత్వం స్వీకరించారు. తక్కినవారి తరఫున డీఎంకే గుర్తింపు కార్డులను వీరందుకున్నారు. డీఎంకేలో చేరి నవారిలో అత్యధికులు మాజీ మంత్రిసెంగోటయ్యన్‌, కేసీ కరు పన్నన్‌ మద్దతుదారులు, అనుచరులు ఉన్నారు. ఈ కార్యక్ర మంలో మంత్రులు దురైమురుగన్‌, ముత్తుసామి, ఎంపీలు టీఆర్‌ బాలు, ఎ. రాజా, ఆర్‌ఎస్‌ భారతి, అందియూరు సెల్వరాజ్‌,  తదితర డీఎంకే నేతలు పాల్గొన్నారు. 


కొంగునాడులో సత్తా చూపిస్తా : డీఎంకే సభ్యత్వం స్వీకరించిన తోప్పు వెంకటాచలం అన్నా అరివాలయం వెలు పల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంగుమండలంలోనే అన్నాడీ ఎంకే అత్యధిక స్థానా ల్లో గెలిచిందని, ప్రస్తుతం ఆ మండలానికి చెందిన అన్నాడీ ఎంకే ప్రముఖులు, నేతలు, కార్యకర్తలంతా డీఎంకేలో చేరారని చెప్పారు. డీఎంకే అధికారంలోకి రాగానే ముఖ్య మంత్రి స్టాలిన్‌ ప్రజలకు చక్కటి పరిపాలనను అందిస్తున్నా రని, మహిళల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని, సిటీ బస్సులలో వారికి ఉచిత ప్రయాణ సదు పాయం కల్పించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాలిన్‌ పరిపాలనపై  అందరూ దృష్టిసారిస్తున్నారని చెప్పారు. అన్నా డీఎంకే నేతలు, కార్యకర్తల డీఎంకేలో చేరటంతో ఈరోడ్‌ జిల్లా ప్రస్తుతం డీఎంకే ఆధీనంలోకి వచ్చిందన్నారు. కొంగు మండలం ఇకపై డీఎంకే కంచుకోటగా మార్చేందుకు తాను, అనుచరులు శాయశక్తులా పాటుపడతామని వెంక టాచలం శపథంచేశారు.తాము నిధి(కాసుల) కోసం రాలేదని, ఉదయ నిధిని వెదుక్కుంటూ వచ్చామని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే గెలుపుకోసం కృషిచేస్తామన్నారు.

Updated Date - 2021-07-12T16:18:07+05:30 IST