కొవిన్‌ పోర్టల్‌ పనితీరుపై విదేశాల ఆసక్తి

ABN , First Publish Date - 2021-06-22T07:22:44+05:30 IST

వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అమలు చేయడానికి కేంద్ర ప్రభు త్వం రూపొందించిన కొవిన్‌ (కొవిడ్‌

కొవిన్‌ పోర్టల్‌ పనితీరుపై విదేశాల ఆసక్తి

ఈ నెల 30న భారత్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు

న్యూఢిల్లీ, జూన్‌ 21: వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అమలు చేయడానికి కేంద్ర ప్రభు త్వం రూపొందించిన కొవిన్‌ (కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) పోర్టల్‌ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. కొవిన్‌ తరహాలోనే పోర్టల్‌ను తయారుచేసి తమ ప్రజలకు వ్యాక్సినేషన్‌ అందించాలని 20కిపైగా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో.. వివిధ దేశాలకు కొవిన్‌ పోర్టల్‌ పనితీరుపై అవగాహన కల్పించడానికి ఈ నెల 30న భారత్‌ ఆధ్వర్యంలో వర్చ్యువల్‌ పద్ధతిలో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.


ఇందులో వియత్నాం, పెరూ, మెక్సికో, ఇరాక్‌, డొమినికన్‌ రిపబ్లిక్‌, పనా మా, ఉక్రెయిన్‌, నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఉగాండా దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. జనవరి 2021 నుంచి కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ఆధారంగా దేశంలో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. కొవిన్‌లో ఇప్పటివరకు 31 కోట్లకుపైనే రిజిస్ట్రేషన్లు జరిగాయి.  


Updated Date - 2021-06-22T07:22:44+05:30 IST