కిలో మల్లెపూలు ఎంతో తెలుసా..!?
ABN , First Publish Date - 2021-01-03T18:27:57+05:30 IST
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత వారం
చెన్నై : మంచు అధికంగా కురిసి దిగుబడులు తగ్గడంతో మల్లెపూలు కిలో రూ.5 వేల ధర పలుకుతోంది. ఏ సీజన్‌లోనైనా మల్లెలపై ఉన్న ఆకర్షణ తగ్గదు. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా పంట పొలాలు నీటమునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చలి తీవ్రత అధికంగా ఉండడం పూల సాగు కూడా దెబ్బతింది. దిండుగల్ జిల్లాలో ప్రతిరోజూ 50 టన్నుల మల్లెపూలు మార్కెట్‌కు వస్తుంటాయి. కానీ, ప్రస్తుతం మంచు కారణంగా 50 కిలోల మాత్రమే వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత వారం కిలో మల్లెలు రూ.3 వేల ధర పలుకగా, క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా మల్లె ధర రూ.5 వేలకు చేరుకుంది. సంక్రాంతి పండుగ రానున్న దృష్ట్యా ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు పేర్కొంటున్నారు.