ఫలపుష్ప ప్రదర్శన Punithకు అంకితం
ABN , First Publish Date - 2021-11-21T18:39:22+05:30 IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26న బెంగళూరులోని లాల్‌బాగ్‌లో ఉద్యానవనాలశాఖ ఏర్పాటు చేయబోతున్న ఫలపుష్ప ప్రదర్శనను ఈసారి పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్‌కు అంకితం చేయనున్నారు. ఈ

- లాల్‌బాగ్‌లో వినూత్న నివాళి అర్పించేందుకు సన్నాహాలు
బెంగళూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26న బెంగళూరులోని లాల్‌బాగ్‌లో ఉద్యానవనాలశాఖ ఏర్పాటు చేయబోతున్న ఫలపుష్ప ప్రదర్శనను ఈసారి పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్‌కు అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని తోటలు, ఉద్యానవనాలశాఖ మంత్రి మునిరత్న బెంగళూరులో శనివారం మీడియాకు చెప్పారు. లాల్బాగ్ ఫలపుష్ప ప్రదర్శనలో కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్, పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ ఆకృతులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించబోతున్నట్టు తెలిపారు. ఇందుకు దేశవిదేశాలకు చెందిన లక్షలాది పుష్పాలను వినియోగిస్తామన్నారు. ఇప్పటికే కళాకారులు ఇందుకు సన్నాహాలు చేపట్టారన్నారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొవిడ్ నియమాలను పాటిస్తూ ప్రదర్శనను నిర్వహించాలని ఉద్యానవనాలశాఖ అధికారులకు సూచించామన్నారు. కొవిడ్ కారణంగా లాల్‌బాగ్‌లో ఎంతవరకు మూడు ఫలపుష్ప ప్రదర్శనలు రద్దయ్యాయని, ప్రస్తుతం జరగబోయే ప్రదర్శనకు ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారన్నారు.