రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు రోగుల మృతి
ABN , First Publish Date - 2021-05-05T19:02:33+05:30 IST
రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది....

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.ఈ విచారణకు కలెక్టరు కమిటీని ఏర్పాటు చేశారు. రూర్కీ ఆజాద్ నగర్ లోని 85 పడకల కొవిడ్ -19 ఆసుపత్రిలో ఉన్న 20 సిలిండర్లు అయిపోవడంతో తెల్లవారుజామున మార్చారు. దీంతో ఐదుగురు కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని జిల్లామెజిస్ట్రేట్ చెప్పారు. ఆక్సిజన్ అందక రోగులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.