ఒడిశాలో తొలి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసు: అప్రమత్తమైన వైద్యాధికారులు!
ABN , First Publish Date - 2021-06-26T11:49:51+05:30 IST
ఒడిశాలో కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్‌కు...
భువనేశ్వర్: ఒడిశాలో కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించిన మొదటి కేసు డియోఘర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ కట్టడి నియమాలను ఉల్లంఘించవద్దని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజలను హెచ్చరించారు. డియోఘర్ జిల్లాలోని కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు గురించి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ) ఒడిశా ప్రభుత్వానికి సమాచారం అందించిందని రాష్ట్ర వైద్య విద్య, శిక్షణ డైరెక్టరేట్ (డీఎంఈటీ) హెడ్ ప్రొఫెసర్ సీబీ కె మొహంతి తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండూ వైరస్‌కు సంబంధించిన ఇతర వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ కరోనా సెకెండ్ వేవ్ క్షీణించినప్పటికీ, కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించడంలో అలసత్వం వహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు దేశంలో 45 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.