ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2021-05-08T15:44:03+05:30 IST
ఇండియా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది....

ముంబై (మహారాష్ట్ర): ఇండియా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. నావికులు ఉన్న యుద్ధనౌకలో కొంత భాగం నుంచి పొగ వెలువడడాన్ని డ్యూటీ సిబ్బంది గమనించారు. ఓడలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మంటలను అదుపు చేశాు.నౌకలో మంటలు చెలరేగినా సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ముంబైలోని నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌక ముంబైలోని నౌకాశ్రయంలో ఉందని,ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని నేవీ అధికార ప్రతినిధి వివరించారు.