ఈఎస్ఐ ఆసుపత్రిలో మంటలు... రోగుల తరలింపు
ABN , First Publish Date - 2021-05-20T21:28:48+05:30 IST
దేశ రాజధానిలోని పంజాబి బాగ్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పంజాబి బాగ్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఏడు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దింపి మంటలను అదుపు చేశారు. ఆసుపత్రిలోని రోగులను రెస్క్యూ టీమ్ అక్కడి నుంచి సురక్షితంగా తరలించింది. మూడో అంతస్తులోని ఓటీ రూమ్ నుంచి అగ్నిప్రమాదం జరిగినట్టు మధ్యాహ్నం 1.16 గంటలకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయి.