ఇంధన ధరల తగ్గింపుపై కేంద్రం,రాష్ట్రాలు పరస్పరం చర్చించుకోవాలి: నిర్మల
ABN , First Publish Date - 2021-02-26T09:39:00+05:30 IST
ఇంధనాల వినియోగదారులపై తక్కువ భారం ఉండాలని.. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించడానికి సంబంధించి కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం చర్చించుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ

అహ్మదాబాద్, ఫిబ్రవరి 25: ఇంధనాల వినియోగదారులపై తక్కువ భారం ఉండాలని.. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించడానికి సంబంధించి కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం చర్చించుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పెట్రో భారం పెరిగిన నేపథ్యంలో ఇంధనాలపై కేంద్రం సెస్ లేదా ఇతర పన్నులను తగ్గించాలని భావిస్తోందా అని ఆమెను ప్రశ్నించగా.. ఈ ప్రశ్న తనను ధర్మ సంకటంలో పడేసిందన్నారు. కేంద్రం ఇంధనం నుంచి రాబడి పొందుతోందన్న వాస్తవాన్ని దాచడం లేదని, రాష్ట్రాల విషయంలోనూ ఇలాగే ఉందన్నారు. వినియోగదారులపై తక్కువ భారం ఉండేలా ఇంధనంపై పన్నులు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం మాట్లాడుకోవాలని ఐఐఎంఏ విద్యార్థులతో ఇష్ఠాగోష్టిలో చెప్పారు.