'రామ్‌లీలా'‌ ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌‌ను కోరిన రైతు సంఘం

ABN , First Publish Date - 2021-01-18T02:00:58+05:30 IST

దేశ రాజధానిలోని ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో రైతులు ఆందోళనలు నిర్వహించుకునేందుకు ..

'రామ్‌లీలా'‌ ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌‌ను కోరిన రైతు సంఘం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో రైతులు ఆందోళనలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి (బీకేయూఎల్) ఒక లేఖలో నగర పోలీసు కమిషనర్‌ను ఆదివారం కోరింది. బీకేయూఎల్ తరఫున వారి లాయర్ డాక్టర్ ఏపీ సింగ్ ఈ దరఖాస్తును పోలీస్ కమిషనర్‌కు పంపారు. రామ్‌లీలా మైదానంలో ఆందోళనలు నిర్వహించుకునేందుకు తక్షణం ఆదేశాలివ్వాలని పోలీస్ కమిషనర్‌ను ఆ లేఖలో బీకేయూఎల్ కోరింది.


రైతు అంశాలపై ఆందోళనలు జరపాలన్నా, కొనసాగించాలన్నా ఢిల్లీ పోలీసులకు లేఖ రాయాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) శరద్ అరవింద్ బాబ్డే ఇటీవల రైతు సంఘాలకు సూచించిన నేపథ్యంలో బీకేయూఎల్ ఈ దరఖాస్తు పెట్టుకుంది. ఈనెల 12న సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తూ, సమస్య పరిష్కారం కనుగొనేందుకు కమిటీని నియమించింది. తొలి సమావేశం జరిపినప్పటి నుంచి రెండు నెలల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Updated Date - 2021-01-18T02:00:58+05:30 IST