కోట్పా సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరిన ఫైఫా

ABN , First Publish Date - 2021-01-13T22:47:43+05:30 IST

కోట్పా సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరిన ఫైఫా

కోట్పా సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరిన ఫైఫా

న్యూఢిల్లీ: భారతీయ పొగాకు రైతుల జీవనోపాధిపై తీవ్రప్రభావం చూపే కోట్పా సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రధాన మంత్రి మోదీని ఫైఫా అభ్యర్థించింది. ప్రతిపాదిత బిల్లు కారణంగా భారతదేశంలో అక్రమ సిగిరెట్‌ వాణిజ్యం  పెరుగుతుందని, దేశీయంగా వృద్ధి చేసే పొగాకు డిమాండ్‌పై తీవ్రప్రభావం పడటంతో పాటుగా భారతీయ రైతుల సంపాదనపై కూడా అది తీవ్ర ప్రభావం చూపనుందని ఫైఫా పేర్కొంది. అక్రమ సిగిరెట్లు పెరగడం వల్ల భారతీయ ఎఫ్‌సీవీ టొబాకో సాగుదారులకు రూ. 1300కు పైగా కోట్ల నష్టం వాటిల్లుతుందని, అంతర్జాతీయ ఎన్‌జీవోల ప్రభావం బారిన పడవద్దని ఫైఫా అభ్యర్థించింది.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాలలో వాణిజ్య పంటలను సాగు చేస్తోన్న లక్షలాది మంది రైతులు మరియు రైతు శ్రామికుల ప్రయోజనాల కోసం లాభాపేక్ష లేని సంస్థ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్స్‌ (ఫైఫా) కృషి చేస్తోంది. భారతీయ ఎఫ్‌సీవీ పొగాకు రైతుల కోసం కోట్పా మరణ శాసనంగా మారనుంది. ప్రతిపాదిత సవరణ బిల్లు 2020తో భారతదేశంలో సిగిరెట్ల అక్రమ రవాణాకు భారీ తోడ్పాటు లభించనుందని ఫైఫా వెల్లడించింది. ఈ ఫలితంగా భారతీయ రైతులు సాగు చేసే పొగాకుకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయని, ఫైఫా ఇప్పటికే తమ అభ్యర్ధనలను సంబంధిత మంత్రిత్వ శాఖలు అయినటువంటి పీఎంఓ, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమలు, కార్మిక మంత్రిత్వ శాఖలకు సమర్పించింది.

 

గత కొద్ది సంవత్సరాలుగా, పొగాకుపై అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. హెచ్చరికల బొమ్మల పరిమాణం పెంచడం, సిగిరెట్లపై భారీస్థాయిలో పన్నులు విధించడం వంటివి ఉన్నాయి. 2012-13తో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా పన్ను వేయడంతో పాటుగా ఎగుమతుల ప్రమోజనాలను సైతం ఉపసంహరించారు. ఇవన్నీ కూడా రైతుల జీవనోపాధిని దెబ్బతీసేటటువంటివే! మరీ ముఖ్యంగా పొడి, సారవంతం కాని నేలల్లో పొగాకు తరహాలో రాబడులు అందించే ప్రత్యామ్నాయ పంటలనేవీ చూపి రైతులకు సహాయపడలేదని ఫైఫా పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాల్గొవ అతిపెద్ద అక్రమ సిగిరెట్‌ మార్కెట్‌గా ఇండియా నిలుస్తుందని ఫైఫా తెలిపింది. 

Updated Date - 2021-01-13T22:47:43+05:30 IST