కుటుంబంలో అర్హులకు ఫ్యామిలీ పెన్షన్
ABN , First Publish Date - 2021-07-23T07:34:15+05:30 IST
ఉద్యోగి లేదా పదవీ విరమణ పెన్షన్ దారు తమ భాగస్వామి(భార్య/భర్త) చేతిలో హత్యకు
ఉద్యోగి హత్యకేసులో భార్య/భర్త నిందితులైతే..
న్యూఢిల్లీ, జూలై 22: ఉద్యోగి లేదా పదవీ విరమణ పెన్షన్ దారు తమ భాగస్వామి(భార్య/భర్త) చేతిలో హత్యకు గురైతే.. ఆ కుటుంబంలో అర్హులకు కుటుంబ పింఛన్ అందేలా కేంద్రం నిబంధనలను సవరించింది. ఈ మేరకు కేంద్ర సివిల్ సర్వీసుల(పెన్షన్) నిబంధనలు-1972లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒక ఉద్యోగి/పింఛను దారు తమ భాగస్వామి చేతిలో హత్యకు గురైతే.. పెన్షన్‌ను నిలిపివేసేవారు.
నిందితుడు లేదా నిందితురాలికి కోర్టుల్లో శిక్ష పడితేనే.. ఆ కుటుంబంలో అర్హులకు పెన్షన్ ఇచ్చేలా నిబంధనలు ఉండేవి. తాజాగా కేంద్రం చేసిన సవరణలతో.. అర్హులైన కుటుంబ సభ్యులకు పెన్షన్ అందుతుంది. నిందితుడు/నిందితురాలు నిర్దోషిగా తేలేదాకా.. కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులకు గురవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.