రూ.5.27 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువుల పట్టివేత
ABN , First Publish Date - 2021-10-29T17:54:58+05:30 IST
ఉత్తర కర్ణాటక పరిధిలోని 13 జిల్లాలో రూ.5.27 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను స్వాధీనం చేసుకున్నట్లు నకిలీ విత్తనాలు, ఎరువుల నిఘా విభాగం బెళగావి జాయింట్ డైరక్టర్ జిలాని
రాయచూరు(Karnataka): ఉత్తర కర్ణాటక పరిధిలోని 13 జిల్లాలో రూ.5.27 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను స్వాధీనం చేసుకున్నట్లు నకిలీ విత్తనాలు, ఎరువుల నిఘా విభాగం బెళగావి జాయింట్ డైరక్టర్ జిలాని మొకాశి తెలిపారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 79 చోట్ల తమ బృందం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. రాయచూరు జిల్లాలో క్రిమిసంహారక మందులకు సంబంధించి 85 నమూనాలు తీసుకోగా వాటిలో నాలుగు నకిలీవగా గుర్తించామని, ఆయా షాపుల యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. లింగసుగూర్, రాయచూరు తాలూకాల్లో నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా చలామని అవుతున్నాయన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్స్‌లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.