త్వరలో facebook పేరు మారబోతోంది!

ABN , First Publish Date - 2021-10-20T20:36:48+05:30 IST

ఫేస్‌బుక్ పేరు త్వరలో మారబోతున్నట్లు ‘ది వెర్జ్’ ప్రచురించిన

త్వరలో facebook పేరు మారబోతోంది!

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ పేరు త్వరలో మారబోతున్నట్లు ‘ది వెర్జ్’ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. కొత్త పేరుతో కంపెనీని రీబ్రాండ్ చేయాలని ఫేస్‌బుక్ ప్రణాళిక రచించినట్లు తెలిపింది. అక్టోబరు 28న జరిగే కనెక్ట్ సమావేశంలో ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 


ఫేస్‌బుక్ కంపెనీ రీబ్రాండింగ్‌పై సమాచారాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది. ఒరిజినల్ ఫేస్‌బుక్ యాప్, సర్వీస్ బ్రాండింగ్ కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి బ్రాండ్ల పేరెంట్ కంపెనీగా ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్‌ను రీబ్రాండ్ చేయడం వల్ల దాని సోషల్ మీడియా యాప్‌ను ఒక పేరెంట్ కంపెనీ క్రింద ఉండే అనేక ప్రొడక్ట్స్‌గా నిలుపుతుంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఆక్యులస్ వంటి గ్రూపులను ఈ పేరెంట్ కంపెనీ పర్యవేక్షిస్తుంది. ఆల్ఫాబెట్ ఇంక్ పేరెంట్ కంపెనీతో గూగుల్ ఇప్పటికే ఇదే విధమైన స్ట్రక్చర్‌తో పని చేస్తోంది. 


ఫేస్‌బుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియా కంపెనీగా ఉంది. భవిష్యత్తులో ఇది మెటావెర్స్ కాన్సెప్ట్‌గా ఎదగబోతోంది. యూజర్లు వర్చువల్ విశ్వంలో జీవిస్తూ, పని చేసుకుంటూ, ఎక్సర్‌సైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించేదే మెటావెర్స్ కాన్సెప్ట్. జుకర్‌బర్గ్ జూలైలో ఈ విషయాన్ని చెప్పారు. సోషల్ టెక్నాలజీ అంతిమ వ్యక్తీకరణ మెటావెర్స్ అని చెప్పారు. 



Updated Date - 2021-10-20T20:36:48+05:30 IST