అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం

ABN , First Publish Date - 2021-02-26T09:22:17+05:30 IST

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం

ముంబై, ఫిబ్రవరి 25: పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఓ స్కార్పియో వాహనం కలకలం రేపింది. వాహనంలో గిలెటిన్‌ కర్రలు, కొన్ని నంబర్‌ ప్లేట్లు ఉన్నాయి. పేలుడు సామగ్రితో పాటు వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నంబర్‌ ప్లేట్లలో కొన్ని ముఖేశ్‌ అంబానీ భద్రతా బృందంలో ఉపయోగించి వాహనాల్లో నంబర్‌ ప్లేట్లతో మ్యాచ్‌ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతను పెంచారు. ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-26T09:22:17+05:30 IST