‘ఆయన అధికారం కూడా తాత్కాలికమే’

ABN , First Publish Date - 2021-10-31T18:16:24+05:30 IST

గత ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మాదిరిగానే ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కూడా తన పదవిని మధ్యలోనే వదులుకుంటారని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సీఎం ఆబ్రాహీం జోస్యం

‘ఆయన అధికారం కూడా తాత్కాలికమే’

రాయచూరు(Karnataka): గత ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మాదిరిగానే ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కూడా తన పదవిని మధ్యలోనే వదులుకుంటారని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సీఎం ఆబ్రాహీం జోస్యం చెప్పారు. శనివారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ఆయన నగరంలో తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా కొద్దిసేపు మాట్లాడారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలోని నాయకుల వ్యవహార శైలితో తాను అసంతృప్తిగా ఉన్నానని బాహటంగా చెప్పిన సీఎం ఇబ్రాహీం త్వరలోనే జనతాదళ్‌(ఎస్‌) పార్టీలో చేరుతానని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను వ్యక్తిగత నిర్ణయాల వల్ల రాజకీయాల్లో రాలేదని కేవలం సైధ్యాంతిక విభేదాలతోనే పార్టీ మారుతున్నట్లు తెలిపారు. కాగా కాంగ్రెస్‌, బీజేపీల పాలనతో విసిగిపోయిన ప్రజలు జనతాదళ్‌(ఎస్‌) పార్టీని ఆధరించడం ఖాయమని తాను డిసెంబర్‌లో ఆ పార్టీలో చేరి వచ్చి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. 

Updated Date - 2021-10-31T18:16:24+05:30 IST