దేశ్‌ముఖ్‌ కదలికలపై ఆధారాలు: ఫడణవీస్‌

ABN , First Publish Date - 2021-03-24T09:28:52+05:30 IST

దేశ్‌ముఖ్‌ కదలికలపై ఆధారాలు: ఫడణవీస్‌

దేశ్‌ముఖ్‌ కదలికలపై ఆధారాలు: ఫడణవీస్‌

ముంబై- న్యూఢిల్లీ, మార్చి 23: బయటకు చెబుతున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఫిబ్రవరి 5-27 తేదీల మధ్య పూర్తిగా క్వారంటైన్‌లో లేరని, ఈ విషయాన్ని పోలీసు రికార్డులే ధ్రువీకరిస్తున్నాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ‘‘ఆయన 15 తరువాత నాగ్‌పూర్‌లోని తన నివాసం నుంచి బయటకు వెళ్లారు. ‘‘ఫిబ్రవరి 17న ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌ్‌సకు వెళ్లారు. ఫిబ్రవరి 24న మంత్రాలయ (సెక్రటేరియట్‌)కు వెళ్లారు. వీఐపీ కదలికల నివేదికలు ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నెలకు వంద కోట్ల రూపాయల మేర బార్లు, హుక్కా సెంటర్ల నుంచివసూలు చేయాలంటూ సచిన్‌ వాజే సహా కొందరు పోలీసు అధికారులతో ఆయన చర్చించిన స్కీము ఆ మధ్యకాలంలో జరిగింది. ఇందుకు తిరుగులేని సాక్ష్యాలున్నాయి’’ అని ఫడణవీస్‌ అన్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ అక్రమాలపై విచారణ జరపాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ  బదిలీ వేటు పడ్డ నగర పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌సింగ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై వాదనలను సుప్రీంకోర్టు బుధవారం ఆలకించనుంది. 

Updated Date - 2021-03-24T09:28:52+05:30 IST