JK: ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-08-21T16:50:42+05:30 IST

జమ్మూకశ్మీరులో శనివారం జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు....

JK: ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

అవంతిపొరా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో శనివారం జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు. అవంతిపొరా పరిధిలోని నాగబరాన్ ట్రాల్ ప్రాంతంలో శనివారం కేంద్ర భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నాగబరాన్ ట్రాల్ అడవుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కేంద్ర భద్రతా బలగాలు శనివారం గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరపడంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. 


Updated Date - 2021-08-21T16:50:42+05:30 IST