జమ్మూకశ్మీర్‌లో Encounter...ముగ్గురు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-12-08T17:36:07+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు...

జమ్మూకశ్మీర్‌లో Encounter...ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు.షోపియాన్ జిల్లా ఈ చోలన్ గ్రామం వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలిసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు.షోపియాన్ జిల్లా చోలన్ ఏరియాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్ జోన్ పోలీసులు బుధవారం ట్వీట్ చేశారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నాయి. 


Updated Date - 2021-12-08T17:36:07+05:30 IST