ఆస్ట్రేలియా రెస్క్యూ టీంపై నెటిజన్ల ప్రశంసల జల్లు!

ABN , First Publish Date - 2021-03-24T10:26:44+05:30 IST

ఆస్ట్రేలియా రెస్క్యూ టీంకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని పట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. రెస్క్యూ టీంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లో

ఆస్ట్రేలియా రెస్క్యూ టీంపై నెటిజన్ల ప్రశంసల జల్లు!

సిడ్నీ: ఆస్ట్రేలియా రెస్క్యూ టీంకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని పట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. రెస్క్యూ టీంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో సిడ్నీని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 20 శునకాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న అల్లాడుతున్న వాటిని చూసి ఆస్ట్రేలియా రెస్క్యూ టీం సభ్యులు చలించిపోయారు. ఈ క్రమంలో వరదల్లో చిక్కుకున్న శునకాలను రక్షించి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘రెస్క్యూ టీం చేసిన పని హృదయాన్ని తాకింది’ అంటూ పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రానికి భారీ వరదలు సంభవించాయి. 


Updated Date - 2021-03-24T10:26:44+05:30 IST