ఏనుగు దాడిలో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-08-27T15:48:25+05:30 IST

క్రిష్ణగిరి జిల్లా డెంకణకోట తాలూకా గుడియూరు గ్రామంలో ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు గురువారం డెంకణీకోట పోలీస్ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. పోలీసులు

ఏనుగు దాడిలో వృద్ధుడి మృతి

డెంకణీకోట(కర్ణాటక): క్రిష్ణగిరి జిల్లా డెంకణకోట తాలూకా గుడియూరు గ్రామంలో ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు గురువారం డెంకణీకోట పోలీస్ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పచ్చప్ప(65) గుడియారు నుంచి కల్లుపల్లి గ్రామానికి కాలి నడకన వెళ్తండగా పొదల్లో దాగి ఉన్న ఏనుగు  ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షల నిమిత్తం శవాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-27T15:48:25+05:30 IST