ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-06-22T18:16:49+05:30 IST

కృష్ణగిరి జిల్లా డెంకణీకోట తాలూకా సూల కుంటా సమీపంలోని ఉబిండా గ్రామంలో ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగు చేసింది. వివరాల

ఏనుగు దాడిలో వ్యక్తి మృతి


డెంకణీకోట(కర్ణాటక): కృష్ణగిరి జిల్లా డెంకణీకోట తాలూకా సూల కుంటా సమీపంలోని ఉబిండా గ్రామంలో ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగు చేసింది. వివరాల మేరకు సదరు గ్రామానికి చెందిన కుంటప్ప (63) అటవీప్రాంతంలోని తన పొలానికి కాపాలాకోసం వెళ్లాడు. ఆ సమయంలో పొదల్లో ఉన్న ఏనుగు అతడిపై దాడి చేయడంతో కుంటప్ప ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో వెళ్లిన స్థానికులు అతన్ని గమనించి అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2021-06-22T18:16:49+05:30 IST