ఐదు అసెంబ్లీల పోరు.. విధివిధానాలు ప్రకటించిన ఈసీ

ABN , First Publish Date - 2021-02-27T00:05:52+05:30 IST

ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలు కాల పరిమితి త్వరలో ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ-మే 24, అస్సాం అసెంబ్లీ- మే 31, కేరళ అసెంబ్లీ-జూన్ 1, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ-మే30న గడువు ముగినయనుంది

ఐదు అసెంబ్లీల పోరు.. విధివిధానాలు ప్రకటించిన ఈసీ

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తంగా త్వరలో జరగబోయే ఐదు అసెంబ్లీల్లో 824 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న పరిధిలో 18.68 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2.7 లక్షల సిబ్బందిని వినియోగించనున్నట్లు ఈసీ ప్రకటించింది.


ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలు కాల పరిమితి త్వరలో ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ-మే 24, అస్సాం అసెంబ్లీ- మే 31, కేరళ అసెంబ్లీ-జూన్ 1, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ-మే30న గడువు ముగినయనుంది. ఇక ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామాతో పుదుచ్చేరి అసెంబ్లీ ఇప్పటికే రద్దైంది. తేదీలు ప్రకటించిన అనంతరమే ఆయా రాష్ట్రాల్లో మోడల్ ఆఫ్ కండక్ట్ కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో క్లిష్టమైన, పోలింగ్‌కు ఇబ్బందిగా ఉండే కేంద్రాలు గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో తగినంత సీఆర్‌పీఎఫ్ బలగాల ఏర్పాటుకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోన్నారు.


కోవిడ్ దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద సానిటైజర్, మాస్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి ముందుగానే వీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-02-27T00:05:52+05:30 IST