అసోం,ఢిల్లీలలో భూప్రకంపనలు
ABN , First Publish Date - 2021-06-01T10:56:55+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రోహిణి ఏరియాలో సోమవారం రాత్రి భూప్రకంపనలు...
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రోహిణి ఏరియాలో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి.రోహిణి ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. రోహిణి ప్రాంతంలో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 2.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఆదివారం అసోంలోని తేజ్ పూర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. అసోంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. గతంలోనూ అసోం ప్రాంతంలో భూమి పలు సార్లు కంపించింది. అసోంలో గత భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.1గా రికార్డు అయింది. అసోం, ఢిల్లీ ప్రాంతాల్లో తరచూ భూప్రకంపనలతో ప్రజలు కలవర పడ్డారు.