కొవిడ్‌ కాలంలో.. పెరిగిన పనిగంటలు

ABN , First Publish Date - 2021-05-18T07:43:49+05:30 IST

కొవిడ్‌ కాలంలో ఉద్యోగులు, కార్మికుల పనిగంటలు పెరిగాయని, దీని వల్ల గుండెకు ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది

కొవిడ్‌ కాలంలో.. పెరిగిన పనిగంటలు

గుండెకు ముప్పంటున్న డబ్ల్యూహెచ్‌వో


జెనీవా, మే 17: కొవిడ్‌ కాలంలో ఉద్యోగులు, కార్మికుల పనిగంటలు పెరిగాయని, దీని వల్ల గుండెకు ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.  సాధారణ పనిగంటల కంటే అధికంగా పనిచేసే వారిలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ డబ్ల్యూహెచ్‌వో పరిధిలోని పర్యావరణం, వాతావరణ మార్పులు, ఆరోగ్య విభా గం డైరెక్టర్‌ మారియా నైరా వివరించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ వో), డబ్ల్యూహెచ్‌వో సంయుక్తంగా 2000-2016 మధ్య కాలంలో 194 దేశాల్లో నిర్వహించిన సర్వేలో.. ఎక్కువ గంటలు పనిచేసేవారిలో గుండెపోటు మరణా లు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్క 2016లోనే.. ఈ కోవలో సుమారు 7.45 లక్షల మంది గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణించారని వివరించారు. గడిచిన పదేళ్లలో ఈ ముప్పు మరింత పెరిగిందని.. చైనా, జపాన్‌, ఆస్ట్రేలియాల్లోనే ఈ తరహా మరణాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. 

Updated Date - 2021-05-18T07:43:49+05:30 IST