విమానాశ్రయ రన్‌వేపైకి దూసుకొచ్చిన కారు..

ABN , First Publish Date - 2021-01-16T23:07:53+05:30 IST

విమానాశ్రయ రన్‌వేపైకి దూసుకొచ్చిన కారు..

విమానాశ్రయ రన్‌వేపైకి దూసుకొచ్చిన కారు..

థాయిలాండ్: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. మద్యం తాగిన వ్యక్తి వాహనం నడుపుకుంటూ బ్యాంకాక్ విమానాశ్రయ రన్‌వేపైకి దూసుకొచ్చాడు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ఒక వ్యక్తి తన కారుతో బ్యాంకాక్ సమీపంలోని సువర్ణభూమి విమానాశ్రయంలో రన్‌వేపైకి దూసుకొచ్చాడని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.


అప్పుడే ల్యాండ్ అయిన బోయింగ్ 777 విమానానికి దగ్గరగా రన్ వే వెంట డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. సెక్యూరిటీ కవర్‌ను ఉల్లంఘించినప్పుడు ఆ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలిందని థాయిలాండ్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2021-01-16T23:07:53+05:30 IST