విదేశాల నుంచి ఏపీకి మాదకద్రవ్యాలు

ABN , First Publish Date - 2021-10-28T09:00:02+05:30 IST

విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను చెన్నైలో పట్టుకున్నారు. నెదర్లాండ్స్‌, అమెరికాల నుంచి..

విదేశాల నుంచి ఏపీకి మాదకద్రవ్యాలు

చెన్నై, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను చెన్నైలో పట్టుకున్నారు. నెదర్లాండ్స్‌, అమెరికాల నుంచి ఏపీకి చెందిన రెండు చిరునామాల పేరుతో వచ్చిన మాదకద్రవ్యాలను చెన్నై విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెదర్లాండ్స్‌ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన ఒక పార్శిల్‌లో అత్యంత ఖరీదైన 10 మాదకద్రవ్యాల మాత్రలు, 8 గ్రాముల పొడి, అమెరికా నుంచి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన పార్శిల్‌లో 132 గ్రాముల మత్తు పదార్థం లభ్యమైంది. కాగా ఏపీ చిరునామాలతో పాటు చెన్నైకి కూడా మరో రెండు పార్శిళ్లలో మాదకద్రవ్యాలు వచ్చాయి. స్పెయిన్‌ నుంచి వచ్చిన పార్శిల్‌లో 10 గ్రాముల మత్తు పదార్థాలు ఉన్నాయి. నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన మరో పార్శిల్‌లో విదేశాలకు చెందిన 261 మత్తు మాత్రలు  గుర్తించారు.

Updated Date - 2021-10-28T09:00:02+05:30 IST