డ్రోన్ ద్వారా దోమల మందు పిచికారీ
ABN , First Publish Date - 2021-07-02T13:04:01+05:30 IST
చెన్నైలో దోమల నిర్మూలన చర్యలను కార్పొరేషన్ ముమ్మరం చేసింది. ఇందుకోసం నీటి నిల్వ ప్రాంతాలు, కాలువ ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా దోమల మందు పిచికారీ పనులు గురువారం ప్రారంభమ య్యాయి. ఈ విష
పెరంబూర్(చెన్నై): చెన్నైలో దోమల నిర్మూలన చర్యలను కార్పొరేషన్ ముమ్మరం చేసింది. ఇందుకోసం నీటి నిల్వ ప్రాంతాలు, కాలువ ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా దోమల మందు పిచికారీ పనులు గురువారం ప్రారంభమ య్యాయి. ఈ విషయమై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విడుదల చేసిన ప్రకటనలో, కార్పొరేషన్, అన్నా విశ్వవిద్యాలయం ‘ఏవానిక్స్’ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా బకింగ్‌హామ్, కొడుంగైయూర్, వ్యాసర్పాడి, కెప్టెన్ కాటన్, కూవం, ఓట్టేరి నల్లా, విరుగంబాక్కం, అడయార్, వీరంగల్ ఓడై, మాంబలం తదితర కాలువల్లో సుమారు 140 కి.మీ దూరానికి దోమల మందు పిచికారీ చేయన్నుట్టు తెలిపింది. 15 రోజులు ఈ పనికి చేపడతామని, మందు పిచికారీ చేసిన మరుసటిరోజు ఆయా ప్రాంతాల్లో అధికారులు తనిఖీ చేసి దోమల ఉత్పత్తిని పరిశీలిస్తారని కార్పొరేషన్ తెలిపింది.