డ్రైనేజీలో ఊపిరాడక నలుగురు కార్మికుల మృతి

ABN , First Publish Date - 2021-12-25T09:18:33+05:30 IST

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన నలుగురు మునిపల్‌ కార్మికులు లోపల ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు. ...

డ్రైనేజీలో ఊపిరాడక నలుగురు కార్మికుల మృతి

 మహారాష్ట్రలో విషాదం.. భద్రతా చర్యల లోపంతో ఘటన 

సోలాపూర్‌, డిసెంబరు 24: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన నలుగురు మునిపల్‌ కార్మికులు లోపల ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు. గురువారం అక్కల్‌కోట్‌ పట్టణంలో నలుగురు డ్రైనేజీలోకి దిగారు. వీరిలో ఇద్దరు లోపలే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికులు అతికష్టమ్మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సోలాపూర్‌ మునిసిపల్‌ కార్పొరేషనే కారణమని, కార్మికుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.  

Updated Date - 2021-12-25T09:18:33+05:30 IST