టీకా వేయించుకుని, ఆరోగ్యంగా మీ ముందుకు వచ్చా: డాక్టర్ వీకే పాల్

ABN , First Publish Date - 2021-01-20T17:07:16+05:30 IST

‘నేను కరోనా టీకా వేయించుకున్నాను. జనవరి 16న ఢిల్లీలోని...

టీకా వేయించుకుని, ఆరోగ్యంగా మీ ముందుకు వచ్చా: డాక్టర్ వీకే పాల్

న్యూఢిల్లీ: ‘నేను కరోనా టీకా వేయించుకున్నాను. జనవరి 16న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నేను ముందుకొచ్చి కోవ్యాక్సిన్ వేయించుకున్నాను. ఈరోజు మూడు రోజుల తరువాత మీ ముందు ఉన్నాను. నాకు ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు. అయితే కొంతమందిలో టీకా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. అయితే అది అత్యంత అరుదుగా జరుగుతుంటుంది’ అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో వీకే పాల్ మాట్లాడుతూ టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు చెబుతున్నాను. పలు దేశాలు టీకాను అభివృద్ధి చేయడంలో ఇంకా విజయం సాధించలేదని, అయితే భారత్ టీకాను అభివృద్ధి చేయడంలో అమోఘ విజయం సాధించిందన్నారు. దీంతో అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. అందరూ టీకా వేయించుకోవాలని కోరుతున్నానని అన్నారు.

Updated Date - 2021-01-20T17:07:16+05:30 IST