అవయవాలను దానం చేయండి: మాండవీయ

ABN , First Publish Date - 2021-11-28T08:26:08+05:30 IST

అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, ఇతరులు కూడా ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

అవయవాలను దానం చేయండి: మాండవీయ

న్యూఢిల్లీ, నవంబరు 27: అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, ఇతరులు కూడా ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పిలుపునిచ్చారు. 12వ భారత అవయవదాన దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఒక సందేశం ఇచ్చారు. జీవించి ఉండగా రక్తదానం, మరణించిన తరువాత అవయవదానం అనేది మన నినాదం కావాలన్నారు. అవయవాల మార్పిడిలో అమెరికా, చైనా తరువాత 3వ స్థానంలో భారత్‌ ఉన్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-11-28T08:26:08+05:30 IST