అన్ని ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించొద్దు!

ABN , First Publish Date - 2021-03-14T07:37:17+05:30 IST

ప్రస్తుత పరిస్థితులపై అపారమైన విజ్ఞానాన్ని సంపాదించి దేశ పురోగతికి తోడ్పడాలని రాజ్యసభలోకి కొత్తగా అడుగు పెట్టిన ఎంపీలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సూచించారు

అన్ని ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించొద్దు!

ఏ విమర్శలో అయినా విశ్వసనీయత ముఖ్యం

కొత్త ఎంపీలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన 


న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితులపై అపారమైన విజ్ఞానాన్ని సంపాదించి దేశ పురోగతికి తోడ్పడాలని రాజ్యసభలోకి కొత్తగా అడుగు పెట్టిన ఎంపీలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సూచించారు. కొత్త ఎంపీలకు శనివారం రాజ్యసభ సచివాలయంలో నిర్వహించిన ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. ప్రభుత్వంపై చేసే విమర్శల్లో విశ్వసనీయత ఉండాలని, కేవలం రికార్డు కోసం చేయవద్దని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. కానీ విమర్శలకు విశ్వసనీయత ఉండాలి. రికార్డు కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకంచడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, సభలో ఎలా మెలగాలో, ప్రసంగం చేసే తీరు, నియమ నిబంధనలను అనుసరించడంపై ఎంపీలకు పలు సూచనలు చేశారు.  

Updated Date - 2021-03-14T07:37:17+05:30 IST